కూతురు కోసం మార్పులు చేయించిన షారుక్ ఖాన్.. గురు శిష్యులు కదా మరి
on Apr 20, 2024
సిల్వర్ స్క్రీన్ మీద వారసత్వం కొత్త విషయమేమి కాదు. హీరో, హీరోయిన్,డైరెక్టర్ ల దగ్గరనుంచి 24 క్రాఫ్ట్స్ కి చెందిన వారసులు సినీ రంగంలో రాణిస్తు వస్తున్నారు. ఇక హీరోలు అయితే తమ వారసులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ఒక అగ్ర హీరో తన కూతురు తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తుంది.కాకపోతే అందులో చిన్న చేంజ్. దీంతో ఆ న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఇండియా వైడ్ గా ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో కింగ్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తుంది. పైగా సుహానా ఫస్ట్ మూవీ కావడంతో షారుక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. షారుఖ్ ఒక అతిధి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు గతంలో వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం సుహానా కి మార్గనిర్దేశం చేసే గురువుగా కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం స్క్రిప్ట్ లో భారీ మార్పులు
కూడా జరిగాయని అంటున్నారు. అంటే తండ్రి కూతుళ్లు గురు శిష్యులుగా నటించబోతున్నారు.
ఇప్పుడు ఈ వార్తతో షారుక్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయ్యింది. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద షారుక్ అండ్ సుహానా కాంబో చూస్తామనే క్యూరియాసిటీ వాళ్ళల్లో ఉంది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో కింగ్ తెరకెక్కబోతుంది.ఫైట్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.అందుకోసం విదేశీ స్టంట్ మాస్టర్ లని తీసుకొస్తున్నారు. ఈ ఏడాది అగస్ట్ లో షూటింగ్ ని ప్రారంభించి 2025 లో రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు.
Also Read